మహేష్ బాబుగా మారిన డేవిడ్ వార్నర్

మహేష్ బాబుగా మారిన డేవిడ్ వార్నర్

ధనాధన్ బ్యాటింగ్తో అలరించే  డేవిడ్ వార్నర్..టిక్ టాక్ వీడియాలతోనూ  ఎంటర్‌టైన్ చేస్తాడు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఫ్యామిలీ‌తో కలిసి  ఎన్నో టిక్ టాక్ వీడియోలు చేసి..ఫ్యాన్స్ను  ఆకట్టుకున్నాడు.

స్పూఫ్ వీడియోలతో ఆశ్చర్యపరిచాడు. టాలీవుడ్  హీరోల  డైలాగ్స్ను యాప్‌ల ద్వారా  మార్ఫింగ్ చేస్తూ ఆకట్టుకున్నాడు. హీరోల ఫేస్లకు తన ముఖాన్ని జత చేసి డైలాగ్లు చెప్పాడు. 

మళ్లీ మొదలు పెట్టాడు..
కొద్ది రోజులుగా టిక్ టాక్ వీడియోలకు బ్రేక్ ఇచ్చిన..గ్యాప్ తర్వాత మళ్లీ స్టార్ట్ చేశాడు. ఇందులో భాగంగా  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు సంబంధించిన ఓ పాపులర్ సీన్‌ను స్పూఫ్ చేశాడు. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వచ్చిన ఖలేజా  సినిమాలోని ఓ సన్నివేశాన్ని తన ఫేస్‌తో మార్ఫింగ్ చేసి నేనేవరో చెప్పుకోండి? అని ప్రశ్నించాడు. ఈ వీడియోను చూసిన టాలీవుడ్ ఫ్యాన్స్ .. వార్నర్ బాబు అంటూ కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా మహేశ్ బాబు ఫ్యాన్స్ అయితే తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

వార్నర్కే సారథ్య బాధ్యతలు..?
వన్డేల నుంచి ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ తప్పుకోవడంతో..ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్సీ ఖాళీ అయింది. అయితే కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ ను నియమిస్తారన్న ప్రచారం జరుగుతంది. మాజీల నుంచి క్రికెట్ విశ్లేషకుల వరకు కెప్టెన్ గా వార్నర్ అయితేనే బెటర్ అని చెప్తున్నారు. మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌, టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సైతం వార్నర్‌కే నాయకత్వ  బాధ్యతలు ఇవ్వాలని సూచిస్తున్నారు. అతనికే తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు.

నిషేధం ఎత్తేస్తారా.?
2018 బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో వార్నర్ ప్రధాన దోషిగా తేలాడు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా అతనిపై  కెప్టెన్సీ చేపట్టకుండా జీవిత కాల నిషేధం విధించింది. అయితే ఈ నిషేధం ఎత్తేయాలని గత కొన్నాళ్లు వార్నర్ వైఫ్తో పాటు..,  ఆసీస్ మాజీ క్రికెటర్లు.. క్రికెట్ ఆస్ట్రేలియాను డిమాండ్ చేస్తున్నారు. వార్నర్ సైతం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి నిషేధం ఎత్తేస్తే..వార్నర్ ఆస్ట్రేలియా వన్డే పగ్గాలు చేపట్టడం ఖాయం. 
 

మరిన్ని వార్తలు