సచిన్ కాదు.. క్రికెట్ లో అతడే ఆల్‌టైం గ్రేట్: డేవిడ్ వార్నర్

సచిన్ కాదు.. క్రికెట్ లో అతడే ఆల్‌టైం గ్రేట్: డేవిడ్ వార్నర్

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ భారత క్రికెట్ లోనే కాదు ప్రపంచ క్రికెట్ లో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఎన్నో రికార్డులు అంతకు మించిన ఖ్యాతి సంపాదించిన సచిన్ ని ఎంతో మంది  ఆల్ టైం గ్రేట్ గా అభివర్ణిస్తారు. కానీ ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ వార్నర్ మాత్రం సచిన్ పేరు చెప్పకుండా మరొకరి పేరు చెప్పి భారత అభిమానులని  హర్ట్ చేసాడు.

టీమిండియాతో మూడు వన్డేలో సిరీస్ లో భాగంగా భారత గడ్డపై అడుగుపెట్టిన ఆస్ట్రేలియా తొలి వన్డేలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ జియో సినిమాతో మాట్లాడి తన మనసులో మాటలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా క్రికెట్ లో ఆల్ టైం గ్రేట్ అనే ప్రశ్నకు సౌత్ ఆఫ్రికా ఆల్ రౌండర్ జాక్ కల్లిస్ పేరు చెప్పాడు. ధోనీ ఆల్ టైం బెస్ట్ ఫినిషర్ అని.. సచిన్ తో కలిసి వన్డేల్లో, సెహ్వాగ్ తో కలిసి టెస్టుల్లో ఓపెనింగ్ చేయాలని ఉందని తెలిపాడు.

కాగా.. ఈ ఆసీస్ బ్యాటర్ కి ఇండియాలో ఏ విదేశీ ఆటగాడికి లేని క్రేజ్ ఉంది. సన్ రైజర్స్ జట్టుకు ఆడి తెలుగు వారికి దగ్గరయ్యాడు. ఇక భారత్ తో జరిగిన తొలి మ్యాచులో 52 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.