Virat Kohli: కోహ్లీతో ఆ కోరిక తీరనందుకు బాధగా ఉంది: ఆస్ట్రేలియా దిగ్గజ ఓపెనర్ ఎమోషనల్

Virat Kohli: కోహ్లీతో ఆ కోరిక తీరనందుకు బాధగా ఉంది: ఆస్ట్రేలియా దిగ్గజ ఓపెనర్ ఎమోషనల్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ నిర్ణయం ప్రపంచ క్రికెట్ కు ఆశ్చర్యాని కలిగించింది. ఫిట్ నెస్.. ఫామ్.. అనుభవం ఇలా ఏ రకంగా చూసుకున్నా కోహ్లీ టెస్ట్ క్రికెట్ లో కొనసాగడానికి అర్హుడు. విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ పై ప్రపంచ క్రికెట్ తో పాటు ఇతర రంగంలోని టాప్ క్రీడాకారులు స్పందించారు. కోహ్లీ క్రికెట్ లో చూపించిన ప్రభావం గురించి గొప్పగా మాట్లాడారు. ఆస్ట్రేలియా దిగ్గజ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పడంతో ఈ మాజీ ఆసీస్ సంతృప్తికరంగా లేనట్టు కనిపిస్తోంది.   

"విరాట్ టెస్ట్ ఫార్మాట్ కు అద్భుతమైన రాయబారి. నేను చూసిన ఆటగాళ్లలో అతను అత్యంత కష్టపడి పనిచేసే స్వభావం కలవాడు. మేము ప్రత్యర్థి జట్ల కోసం ఆడుతూ ఉండవచ్చు కానీ నేను అతనిలో ఎప్పుడూ గౌరవించేది అతని వైఖరి, ఆత్మవిశ్వాసం. నన్ను అడిగితే నేను కనీసం ఒక్కసారైనా విరాట్‌తో ఒకే జట్టులో ఆడాలని అనుకున్నాను. అలా చేస్తే బాగుండేది. నా జీవితంలో ఒక ఆటగాడిగా కోహ్లీతో కలిసి ఒక జట్టు తరపున ఆడలేకపోవడం నా నెరవేరని కోరికలలో ఒకటిగా మిగిలిపోతుంది" అని వార్నర్ రెవ్‌స్పోర్ట్జ్‌తో అన్నారు. దశాబ్దకాలంగా కోహ్లీ, వార్నర్ ఐపీఎల్ లో 
ప్రత్యర్థులుగా ఆడినా.. కలిసి ఒకే జట్టు తరపున ఆడే అవకాశం ఇప్పటివరకూ రాలేదు.    

కోహ్లీ రిటైర్మెంట్ వేడుకలు గ్రాండ్ గా జరగనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక కానుంది. ఫ్యాన్స్ కోహ్లీకి టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అతని ఓ రేంజ్ లో సెండ్ ఆఫ్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఫ్యాన్స్ ఒక సర్ ప్రైజ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.కోహ్లీ ఫ్యాన్స్ వైట్ జెర్సీలను ధరించి గ్రాండ్ గా నివాళులు ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ వైట్ జెర్సీ వెనక కోహ్లీ నెంబర్ 18 ఉండబోతున్నట్టు సమాచారం. అదే జరిగితే చిన్నస్వామి స్టేడియం కోహ్లీ నినాదాలతో దద్దరిల్లడం గ్యారంటీగా కనిపిస్తుంది. 

ఐపీఎల్ 2025లో కోహ్లీ 505 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్ట్ లో నాలుగో స్థానంలో నిలిచాడు. కోహ్లీ టెస్ట్ కెరీర్ విషయానికి వస్తే ఇండియా తరఫున 123 టెస్టులు ఆడి 9230 రన్స్ చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 ఫిఫ్టీలు ఉన్నాయి. ‘టెస్ట్ క్రికెట్‌‌‌‌లో తొలిసారి బ్యాగీ బ్లూ (ఇండియా క్యాప్‌‌‌‌) పెట్టుకొని14 ఏండ్లు గడిచాయి.