వైరల్ న్యూస్.. మోస్ట్ వాంటెడ్ దావూద్ ఇబ్రహీం బతికే ఉన్నాడు

వైరల్ న్యూస్.. మోస్ట్ వాంటెడ్ దావూద్ ఇబ్రహీం బతికే ఉన్నాడు

ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి, భారత మోస్ట్ వాంటెడ్ దావూద్ ఇబ్రహీంకి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. ఆరోగ్యం క్షీణించడంతో ఇటీవల కరాచీలోని 'ఆగాఖాన్ యూనివర్శిటీ హాస్పిటల్ (AKUH)'లో దావూద్ చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దావూద్‌కు వివిధ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఈ పరీక్షలకు సమయం పడుతుందని కూడా ఆయా వర్గాలు వెల్లడించాయి. అతనిపై విషప్రయోగం జరిగిందనేది ఈ కథాంశాల సారాంశంగా తెలుస్తోంది. ఈ వార్తలన్నింటిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ.. దావూద్ ముఠా అధినేత గడిచిన కొన్నేళ్లలో అనేక సార్లు చనిపోయినట్టు వార్తలు వచ్చాయి.

1993 ముంబై వరుస పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీం కొన్నేళ్లుగా పాకిస్థాన్‌లో పరారీలో ఉన్నాడు. వినాశకరమైన బాంబు దాడుల ఫలితంగా 250 మందికి పైగా మరణించారు, వేలాది మంది గాయపడ్డారు. ఈ విషయంపై అప్పట్లో పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగగా.. మళ్లీ ఇన్నాళ్లకు అతని ఆరోగ్య పరిస్థితి గురించి సమాచారం అందడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

భారతదేశంలో ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాతో సహా అనేక ఆరోపణలను ఎదుర్కొంటున్న దావూద్ ఇబ్రహీం 2003లో గ్లోబల్ టెర్రరిస్ట్‌గా గుర్తించబడ్డాడు. డిసెంబర్ 1955లో మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో జన్మించిన ఆయన.. అతని కుటుంబం ఆ తర్వాత ముంబైలోని డోంగ్రీ ప్రాంతానికి తరలివెళ్లింది. 1970లో ముంబై అండర్ వరల్డ్‌లో లీనమై.. మొదట్లో హాజీ మస్తాన్ ముఠాతో సంబంధం పెట్టుకుని.. ఆ తర్వాత D-కంపెనీకి అధిపతిగా మారాడు.