వేధించడమే డీసీపీ ఉద్దేశం : డింపుల్ అడ్వకేట్ పాల్ సత్యనారాయణ 

వేధించడమే డీసీపీ ఉద్దేశం : డింపుల్ అడ్వకేట్ పాల్ సత్యనారాయణ 

వేధించడమే డీసీపీ ఉద్దేశం
చాలాసార్లు ర్యాష్ గా మాట్లాడాడు 
రివర్స్ లో ఆయనే  కేసు పెట్టారు 
మేం ఫిర్యాదు చేస్తే   తీసుకోలేదు 
డింపుల్ అడ్వకేట్ పాల్ సత్యనారాయణ 

హైదరాబాద్ : హీరోయిన్  డింపుల్ ను వేధించాలనేదే డీసీపీ రాహుల్ హెగ్డే   ఉద్దేశమని ఆమె అడ్వకేట్ పాల్ సత్యనారాయణ చెప్పారు. డింపుల్ తో  హెగ్డే చాలాసార్లు ర్యాష్ గా మాట్లాడారన్నారు.  ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. అపార్ట్ మెంట్లో  డింపుల్ పార్కింగ్ ప్లేస్ లో కోన్స్ పెట్టారని, కోన్స్ తీయాలని చాలాసార్లు చెప్పినా డీసీపీ వినకపోవడంతో డింపుల్ కోన్స్ ని కాలుతో తన్నారని చెప్పారు. అసలు క్వార్టర్స్ లో ఉండకుండా డీసీపీ అపార్ట్ మెంట్ లో ఎందుకు ఉంటున్నారో చెప్పాలన్నారు.  

ఒక డీసీపీ స్థాయి వ్యక్తి అమ్మాయిల అమ్మాయి మీదకి వెళ్ళి మాట్లాడతారా అని ప్రశ్నించారు. ఒక సెలబ్రిటీ గా.. ఒక అమ్మాయిగా.. అందులోనూ పోలీస్ ఆఫీసర్ పై కేసు పెట్టేందుకు డింపుల్ వెనుకాడిందని, తీరా చూస్తే డీసీపీ  తన డ్రైవర్ తో రివర్స్ కేసు పెట్టించాడన్నారు. దీంతో డింపుల్ కూడా ఫిర్యాదు చేయడానికి వెళితే పోలీసులు కేసు తీసుకోలేదని చెప్పారు. 4 గంటలు పీఎస్ లో కూర్చోబెట్టారని, తాము లీగల్ గానే ఫైట్ చేస్తామని అడ్వకేట్ తెలిపారు.