- 1.80 లక్షల అప్లికేషన్లు వచ్చాయి: సెట్ కన్వీనర్ కృష్ణ ఆదిత్య
హైదరాబాద్, వెలుగు: బీసీ, ఎస్సీ, ఎస్టీ, సొసైటీ గురుకులాల్లో వచ్చే ఏడాది సీట్ల భర్తీకి ఇచ్చిన టీజీ సెట్– 2026 గడువు ఆదివారంతో ముగిసింది. రాత్రి 12 గంటల వరకు అప్లైకి గడువు ఉండగా సాయంత్రం నాటికి 1.80 లక్షల అప్లికేషన్లు వచ్చినట్టు సెట్ కన్వీనర్, ఎస్సీ గురుకుల సెక్రటరీ కృష్ణ ఆదిత్య వెల్లడించారు. ఈ నెల 21తోనే గడువు ముగిసిందని దాన్ని పొడిగించాలని తల్లిదండ్రులు, స్టూడెంట్ల నుంచి వచ్చిన వినతుల మేరకు ఆదివారం వరకు పెంచామని తెలిపారు. 6 తరగతి నుంచి 9 తరగతి వరకు సీట్లను ఈ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా భర్తీ చేయనున్నారు.
గురుకుల ఎంట్రన్స్ కు అప్లై చేసుకోవాలని కోరుతూ రాష్ర్ట వ్యాప్తంగా టీచర్లు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎంట్రన్స్ మార్కులు, రిజర్వేషన్స్, ఖాళీ సీట్ల ప్రకారం భర్తీ చేస్తామని, మధ్య వర్తుల మాటలను తల్లిదండ్రులు నమ్మెద్దని సెక్రటరీ సూచించారు. ఎన్నో ఏండ్ల తర్వాత కాస్మోటిక్, డైట్ చార్జిలను ప్రభుత్వం పెంచడంతో గురుకుల ఎంట్రన్స్ కు భారీగా అప్లికేషన్లు వచ్చాయని సెక్రటరీ వెల్లడించారు.
