డియర్ మూవీ షూటింగ్ పూర్తి

డియర్ మూవీ షూటింగ్ పూర్తి

జీవీ ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్  లీడ్ రోల్స్‌‌లో నటిస్తున్న చిత్రం ‘డియర్’. ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. వరుణ్ తిరిపురేణి, అభిషేక్ రామ్ శెట్టి, పృథ్వీరాజ్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ‘చెన్నై, ఇడుక్కి, కూనూర్‌‌ తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం.  ముందుగా అనుకున్నట్టుగా ముప్ఫై ఐదురోజుల్లో షూటింగ్ పూర్తయింది. 

పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో టీజర్‌‌‌‌, ట్రైలర్‌‌‌‌తో పాటు సినిమా రిలీజ్‌‌ డేట్‌‌ను అనౌన్స్ చేస్తాం’ అని నిర్మాతలు తెలియజేశారు. కాళి వెంకట్, ఇళవరసు, రోహిణి, తలైవాసల్ విజయ్, గీతా కైలాసం ఇతర పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.