RTC కోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తా:కోమటిరెడ్డి వెంకటరెడ్డి

RTC కోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తా:కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తామన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. సీఎం కేసీఆర్ 50 వేల RTC కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదన్నారు. TRS ప్రభుత్వాన్ని గద్దెదింపి ఆర్టీసీ కార్మికులను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ చూసైనా కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలన్నారు.

ప్రభుత్వం దిగి వచ్చే వరకు కార్మికులతో కలిసి సమ్మెలో పాల్గొంటామన్న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి… కార్మికులు ఆత్మహత్య చేసుకోవద్దని.. కొట్లాడి సాధించుకుందామని కోరారు. కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని ఎర్రబెల్లి, తలసానికి ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.