ఐపీఎల్–2026లో భాగంగా మే 7వ తేదీన జరిగే లక్నో వర్సెస్ బెంగళూర్ మధ్య ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉంది. ఎలిమినేషన్ ను తప్పించుకునేందుకు ఒక టీమ్ ప్రయత్నిస్తుండగా.. టాప్ ప్లేస్ పైన గురిపెట్టింది మరో టీమ్. లక్నోలోని ఎకానా స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ కాస్త రసవత్తరంగానే ఉండేటట్లు కనిపిస్తోంది.
పంజాబ్ పైన సన్ రైజర్స్ గెలిచి టాప్ ప్లేస్ లోకి చేరిన తరుణంలో.. క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో గెలిచిన టీమ్ డైరెక్ట్ ఫైనల్ కు వెళ్లే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో బెంగళూర్ సీరియస్ గా తీసుకుంది ఈ మ్యాచ్ ను.
మరోవైపు ఎలిమినేషన్ ను తప్పించుకునేందుకు.. అదే సమయంలో పరువు నిలబెట్టుకునేందుకు లక్నో గట్టి ప్రయత్నం చేసేందుకు సిద్ధమైంది. అయితే బెంగళూర్ కు ఇప్పటికే దాదాపు వారం రోజుల గ్యాప్ వచ్చింది. గత మ్యాచ్ ఓటమి నుంచి నేర్చకున్న పాఠాలతో.. ఈ మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిందేనని భీష్మిచుకు కూర్చుంది.
ఇటు లక్నో స్క్వేడ్ లో పూరన్ మళ్లీ చేరడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఇక స్టార్ ప్లేయర్ ఫిలిప్ సాల్ట్ గాయం కారణంగా దూరమయ్యే అవకాశం ఉంది. బెంగళూర్ లోఓ కోహ్లీ బెతెల్ గుడ్ స్టార్ట్ ఇచ్చేందుకు సిద్ధం గా ఉన్నారు.
పిచ్, వెదర్:
2026 ఐపీఎల్ సీజన్ లో లక్నో పిచ్.. బ్యాటర్లకు కాస్త కష్టంగానే ఉంది. ఇక్కడ చాలా వరకు తక్కువ స్కోర్స్ నమోదు కావడం చూస్తూ వస్తుంన్నాం. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ 155 మాత్రమే. అదే సమయంలో బౌండరీలు తక్కువ డిస్టెన్స్ లో ఉండటం బ్యాటర్లకు ఉపశమనం.
►ALSO READ | మొన్న రియాన్ పరాగ్... ఇప్పుడు చాహల్ ఏకంగా ఫ్లైట్ లో స్మోక్ చేస్తూ... సోషల్ మీడియాలో వీడియో వైరల్
పిచ్ బ్యాటర్లను కచ్చితంగా పరీక్షిస్తుందని చెప్పవచ్చు. డ్రై సర్ఫేస్ తో.. లైట్ గా గ్రాస్ తో.. మ్యాచ్ జరిగే కొద్ది మార్పులకు గురికావచ్చు. ఈవినింగ్ సైడ్ బాల్ కాస్త స్లో అయ్యే అవకాశం ఉంది. స్పిన్నర్లకు కలిసొస్తుంది. సో.. ఇక్కడ ఛేజింగ్ చేసిన టీమ్ లే ఎక్కువగా గెలిచాయి. మొత్తం 15 మ్యాచ్ లలో 12 మ్యాచ్ లు చేజింగ్ విన్నర్స్ కావడం విశేషం. 170 రన్స్ చేస్తే ఈ పిచ్ పై గెలుపుకు ట్రై చేసుకోవచ్చు.
LSG vs RCB: టీమ్స్ అంచనా
లక్నో సూపర్ XI: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, జోష్ ఇంగ్లిస్, రిషబ్ పంత్ (C/WK), అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, మహమ్మద్ షమీ, మొహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్
ఇంపాక్ట్ సబ్: M సిద్దార్థ్/దిగ్వేష్ సింగ్ రాఠీ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రిడిక్టెడ్ XI: విరాట్ కోహ్లీ, జాకబ్ బెథెల్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (సి), జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ
ఇంపాక్ట్ సబ్: వెంకటేష్ అయ్యర్/రాసిఖ్ సలాం దార్
