ఇండియన్ క్రికెటర్లకు ఏమైంది...? స్మోక్ చేస్తూ కెమెరా కంటికి చిక్కుతున్నారు. మొన్న డ్రెస్సింగ్ రూమ్ లోల్ ఈ సిగరెట్ తాగుతూ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ పట్టుబడితే ఇప్పుడు స్టార్ క్రికెటర్ చాహల్ ఏకంగా ఫ్లైట్ లో స్మోక్ చేస్తూ పట్టుబడ్డాడు. పంజాబ్ కింగ్స్ టీం తో కలిసి ఫ్లైట్ లో వెళ్తున్న సమయంలో ఏదో స్మోక్ చేస్తూ కనపడ్డాడు చాహల్. అర్షదీప్ సింగ్ తన యూట్యూబ్ ఛానల్లో అప్ లోడ్ చేసిన వీడియోతో అడ్డంగా బుక్కయ్యాడు చాహల్.
ఫ్లైట్ లో తన టీం మేట్స్ తో సరదాగా మాట్లాడుతూ యూట్యూబ్ లో ఓ వీడియో అప్ లోడ్ చేశాడు చాహల్. ఆ వీడియోలో పంజాబ్ కింగ్స్ వైస్ కెప్టెన్ శశాంక్ సింగ్ పక్కన కూర్చున్న చాహల్ వైప్ లాంటిది చేతిలో పట్టుకొని స్మోక్ చేస్తూ కనపడ్డాడు. అయితే... ఈ వీడియో యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన కొద్దిసేపటికి చాహల్ స్మోక్ చేస్తున్న క్లిప్ ను డిలీట్ చేశారు. అప్పటికే ఆ క్లిప్ ను స్క్రీన్ షాట్ తీసుకున్న నెటిజన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు.
Here is the deleted video of Chanchal Chutmarika Chahal vaping in flight after sneaking in somehow and risking life of all https://t.co/IDZqbxmH4z pic.twitter.com/paAUmQ9FHb
— Jo Kar (@i_am_gustakh) May 7, 2026
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోకు రకరకాల కామెంట్స్ చేస్తూ స్పందిస్తున్నారు నెటిజన్స్. రియాన్ పరాగ్ తరహాలోనే చాహల్ కు కూడా పనిష్ మెంట్ ఇవ్వాలని కొంతమంది కామెంట్ చేస్తుంటే...చాహల్ సెక్యూరిటీని దాటుకొని ఫ్లైట్ లోకి వైప్స్ ఎలా తీసుకెళ్లాడు అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవడం బెటర్.
►ALSO READ | ఢిల్లీ వేదికగా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్
