ఢిల్లీ వేదికగా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌

 ఢిల్లీ వేదికగా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌

న్యూఢిల్లీ: 22వ కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌‌‌‌షిప్ 2026కు ఢిల్లీ వేదిక కానుంది. ఈ విషయాన్ని  సీఎం రేఖా గుప్తా బుధవారం ప్రకటించారు. ఢిల్లీ ప్రభుత్వం, టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా జులై 27 నుంచి ఆగస్టు 2 వరకు త్యాగరాజ్ స్టేడియంలో ఈ పోటీలను నిర్వహించనున్నాయి. 

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, దక్షిణ ఆఫ్రికా వంటి దేశాల నుంచి క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొననున్నారు. 2036 ఒలింపిక్స్ లక్ష్యంతో నగరాన్ని దేశ క్రీడా రాజధానిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు క్రీడా మంత్రి ఆశిష్ సూద్ పేర్కొన్నారు. ఈ ఈవెంట్ యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంచడమే కాకుండా, భారత క్రీడాకారులకు ప్రపంచ వేదికపై తమ ప్రతిభను చాటుకునే అవకాశం కల్పిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.