జల్లెడ జల్లెడైన డెక్కన్ మాల్ బిల్డింగ్

జల్లెడ జల్లెడైన డెక్కన్ మాల్ బిల్డింగ్

హైదరాబాద్ : రాంగోపాల్ పేటలో ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేత పనులు 6వ రోజు కూడా కొనసాగుతున్నాయి. బిల్డింగ్ ముందు భాగం కూల్చివేత పూర్తైంది. ఇప్పుడు వెనక భాగం కూల్చివేత పనులు జరుగుతున్నాయి. అయితే బిల్డింగ్ కూల్చివేత కీలకం కావడంతో మరింత ఆలస్యం అవుతుందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. కూల్చివేత మొదలు పెట్టె సమయంలో 5 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ.. వెనకాల వైపు చాలా జాగ్రత్తలు తీసుకొని కూల్చుతున్నారు. దీంతో పనులు ఆలస్యం అవుతున్నాయిని కాంట్రాక్టర్లు అంటున్నారు.

కూల్చివేత పూర్తవ్వడానికి మరో 3 రోజులు పట్టే అవకాశం ఉందన్నారు. బిల్డింగ్ చుట్టూ పక్కన బస్తీల్లోని వారు, ఇంటి పరిసరాలకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే బిల్డింగ్ వెనక వైపు ఉన్న బస్తి, అపార్ట్ మెంట్స్, హాస్టల్స్ లను ఖాళీ చేయించారు. 10 రోజులుగా బిల్డింగ్ చుక్కపక్కల ప్రాంతాల్లో కరెంట్ సరఫరాను నిలిపివేశారు. బిల్డింగ్ మొత్తాన్ని కూల్చివేసిన తర్వాతే కరెంట్ సరఫరాను పునరుద్ధరించనున్నామని రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు.