- ఈ నెల 17, 18 తేదీల్లో ఎడిట్ ఆప్షన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఈసెట్-2026) ఎంట్రెన్స్ ఎగ్జామ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల15 వరకు గడువు ఉందని డీఈఈసెట్ కన్వీనర్ జి. రమేశ్ తెలిపారు. ఇప్పటి వరకూ మొత్తం 20,705 దరఖాస్తులు వచ్చాయన్నారు. దీనిలో ఇంగ్లిష్ మీడియం కోసం 12,256 మంది అభ్యర్థులు అప్లై చేసుకోగా.. తెలుగు మీడియానికి 7,543 మంది, ఉర్దూ మీడియానికి 906 మంది దరఖాస్తు చేసుకున్నట్లు కన్వీనర్ వివరించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్‌లో ఏదైనా తప్పులు ఉంటే సరిచేసుకునేందుకు ఈ నెల 17, 18 తేదీల్లో అవకాశం కల్పించారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://schooledu.telangana.gov.in లో వివరాలను ఎడిట్ చేసుకోవచ్చు. ఇతర సందేహాల కోసం హెల్ప్‌లైన్ నంబర్ 8317567404 కు కాల్ చేయాలని సూచించారు.
