21 లక్షల దీపాలతో అయోధ్య కాంతులు

21 లక్షల దీపాలతో అయోధ్య కాంతులు

పవిత్ర అయోధ్య నగరంలో దీపావళి సంబరాలు అంబరాన్ని తాకుతాయి.  దీపావళి రోజు అయోధ్యనగరం   దీప కాంతులతో మెరిసిపోతోంది. గతేడాది దీపావళి రోజున సరయూ నది ఒడ్డున 15.76 లక్షల పైగా ప్రమిదలను వెలిగించి గిన్నిస్​రికార్డు సృష్టించగా.. ఈ ఏడాది 21 లక్షల మట్టి దీపాలను వెలిగించేందుకు యూపీ ప్రభుత్వం సన్నాహాలు జరుపుతుంది. 

యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం 2017 మార్చిలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి ... ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా అయోధ్యలో దీపోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది.ఈ ఏడాది  దీపోత్సవం రామాలయం గర్భగుడిలో రామ్ లల్లా సింహాసనానికి ఎదురుగా నిర్వహించనున్నారు. దీపావళి రోజున ప్రతి ఘాట్, మఠం, ఆలయం, సూర్య కుండ్, భారత్ కుండ్ ,  ప్రతి ఇల్లు దీపాలతో వెలిగిపోతుందని  యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. 

ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి   ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా అయోధ్యలో దీపోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది.  ప్రస్తుతం అయోధ్యలో  దాదాపు రూ. 32 వేల కోట్ల ప్రాజెక్టు పనులు  జరుగుతున్నాయి. దేశంలోని ఏ నగరంలో కూడా ఇంత పెద్ద సంఖ్యలో ప్రాజెక్టు పనులు  జరగడం లేదు.రామ మందిరం గర్భగుడి వద్ద ప్రధాని నరేంద్ర మోడీ రామలల్లాను ప్రతిష్ఠించేటప్పుడు యావత్ ప్రపంచం అయోధ్య వైపు ఆకర్షితులవుతుందని యూపీ సీఎం  అన్నారు. అయోధ్యలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి జాబితా చేర్చారు.  రాబోయే కాలంలో ఇంకా అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌ తదితర ప్రాజెక్టులను నిర్మిస్తామని ఆయన తెలిపారు. 

ప్రతిపక్షాల నుద్దేశించి మాట్లాడుతూ... గతంలో   అయోధ్యలో రహదారి లేదు,  రైలు (కనెక్టివిటీ) లేదు, గోరఖ్‌పూర్ , లక్నో నుండి అయోధ్యకు చేరుకోవడానికి ఐదు-ఆరు గంటలు పట్టేదని.. కాని . ఇప్పుడు, ఈ ప్రయాణానికి . ఒక్క గంట మాత్రమే పడుతుందని యోగి అన్నారు.. ఆరేళ్ల క్రితం ప్రజలు అయోధ్య పేరు  ఎక్కడా చర్చకు రాలేదని .. కానీ బీజేపీ హయాంలో దాని సమగ్ర అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం యోగి అన్నారు.