చెన్నై: ఈ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బానిస కూటమిని ఓడించి, డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్(ఎస్పీఏ)ను గెలిపించాలని తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కోరారు. సోమవారం తిరువొత్తియూర్‌లో సీపీఎం అభ్యర్థి ఎల్. సుందరరాజ్‌కు మద్దతుగా జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు.
కేంద్ర సర్కార్తమిళనాడులో ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించిందని, బీజేపీ చేసిన ద్రోహానికి ప్రజలు ప్రతిస్పందించాలన్నారు. బీజేపీతో అన్నాడీఎంకే పొత్తును ‘బానిస’ కూటమిగా అభివర్ణించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సీఎం ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. పార్టీ శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేయాలని పిలుపునిచ్చారు.

