శాతవాహన వర్సిటీ పరిధిలో 14 నుంచి డిగ్రీ పరీక్షలు

శాతవాహన వర్సిటీ పరిధిలో 14  నుంచి డిగ్రీ పరీక్షలు

కరీంనగర్ టౌన్,వెలుగు: శాతవాహన యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షలు ఈనెల14 నుంచి  ప్రారంభమవుతున్నట్లు ఎగ్జామ్స్ కంట్రోలర్  డి.సురేష్​ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్సిటీ పరిధిలో అన్ని డిగ్రీ కాలేజీల్లో డిగ్రీ రెండో, నాలుగో, ఆరో సెమిస్టర్ పరీక్షలు  ఉంటాయని, ఎగ్జామ్స్ టైమింగ్స్  త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.