లవ్ ఫెయిల్.. స్టూడెంట్ సూసైడ్.. అంబర్ పేటలో ఘటన

లవ్ ఫెయిల్.. స్టూడెంట్ సూసైడ్..   అంబర్ పేటలో ఘటన

అంబర్​పేట, వెలుగు:  లవ్ ఫెయిలైన డిగ్రీ స్టూడెంట్​ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ అంబర్‌‌పేట ఇన్​స్పెక్టర్ టి.కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లాకు చెందిన గొల్ల తిరుమలేశ్(21) అంబర్‌‌పేటలోని హాస్టల్‌‌లో ఉంటూ విద్యానగర్‌‌లోని వివేకానంద డిగ్రీ కాలేజీలో డిగ్రీ థర్డ్​ ఇయర్​ చదువుతున్నాడు. సోమవారం ఉదయం స్నేహితుడి రూమ్​కు వెళ్లాడు. రూమ్ నుంచి  ఫ్రెండ్​ బయటకు వెళ్లిన సమయంలో సీలింగ్ ఫ్యాన్‌‌కు ఉరివేసుకున్నాడు. ప్రేమ ఫెయిల్ అవడంతోనే  ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.