సెప్టెంబర్  21 నుంచి డీఈడీ సెకండియర్ ఎగ్జామ్స్

సెప్టెంబర్  21 నుంచి డీఈడీ సెకండియర్ ఎగ్జామ్స్

హైదరాబాద్, వెలుగు: డీఈడీ, డీపీఎస్ఈ సెకండియర్ పరీక్షలు ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కే. లింగయ్య షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. డీఈడీ సెకండియర్ పరీక్షలు ఈనెల 21 నుంచి 26వ తేదీ వరకు జరుగుతాయి. డీపీఎస్ఈ సెకండియర్ పరీక్షలు 21 నుంచి 25వ తేదీ వరకు కొనసాగుతాయి.

ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. రెగ్యులర్ స్టూడెంట్లతో పాటు గత బ్యాచ్ల్లో ఫెయిలైన విద్యార్థులకు కూడా ఇదే షెడ్యూల్ వర్తిస్తుందని లింగయ్య స్పష్టం చేశారు. విద్యార్థులు పరీక్షలకు ముందుగానే అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.