Delhi bomb blast:ఢిల్లీ పేలుడు ఘటనలో ట్విస్ట్.. సంచలన విషయాలు వెలుగులోకి

Delhi bomb blast:ఢిల్లీ పేలుడు ఘటనలో ట్విస్ట్.. సంచలన విషయాలు వెలుగులోకి

ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనలో సంచలన విషయాలు బయటికొచ్చాయి. దర్యాప్తు చేస్తున్న అధికారులు కీలకమైన ఆధారాలు లభించాయి. పేలుడుకు ముందుకు  మానవ బాంబు గా భావిస్తున్న డాక్టర్​ నబీ కారు ఏయే ప్రాంతాల్లో తిరిగింది.. ఎక్కడెక్కడ పార్కింగ్​ చేశారు.. వంటి విషయాలతో పాటు ఘటనాస్థలంలో ప్రత్యేక బుల్లెట్లు దొరకడం కలకలం రేపుతోంది..  

ఢిల్లీ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. పేలుడు జరిగిన ప్రదేశంలో మూడు 9 mm స్పెషల్​ బుల్లెట్లు లభించారు. క్వాలబర్​ కాట్రిడ్జ్​ లను సీజ్​ చేశారు. వీటిలో రెండు లైవ్​ కాట్రిడ్జ్​ లు, ఒకటి ఖాలీ షెల్​.. అ బుల్లెట్లను భద్రతాదళాలు, ప్రత్యేక అధికారులు మాత్రమే వీటిని ఉపయోగిస్తారు. అయితే ఘటనా స్థలంలో ఎటువంటి పిస్టల్ లభించలేదు. స్పాట్ లో ఉన్న అందరు అధికారుల బుల్లెట్లు తనిఖీ చేశారు. ఆ బుల్లెట్లు ఏ అధికారివి కావు. ఈ బుల్లెట్లు ఘటనా స్థలానికి ఎలా వచ్చాయనే కోణంలో పరిశీలిస్తున్నారు. పేలుడు సమయంలో లేదా తర్వాత అవి కారునుంచి పడిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. 

జైషే మహ్మద్​ నిధులు జాడ తెలిసింది.. 

 ఉమర్ ముజమ్మిల్​, షాహీన్​ ముగ్గురు ఉగ్రవాదులకు సంబంధించిన  రూ. 20 లక్షల నగుదుకు సంబంధించి నిధుల జాడ నిఘా వర్గాలు కనిపెట్టాయి. జైష్​ ఏ మహ్మద్​ హ్యాండ్లర్​ హవాలా నెట్​ వర్క్​ ద్వారా ఈ డబ్బును వీరికి మళ్లించినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. 

ఉగ్రవాదులకు లభించిన నిధులతో వ్యవసాయ ఎరువులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. నత్రజని, భాస్వరం, పొటాషియం, ఆధారంగా ఉంటే కెమికల్స్​ ను కొనుగోలు చేసేందుకు ఖర్చు చేసినట్లు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. వీటితో పేలుడు పదార్థాలను కూడా తయారు చేయొచ్చు. 

అయితే డబ్బు విషయంలో డాక్టర్​ నబీ, డాక్టర్​ షాహీన్​ మధ్య విభేదాలు తలెత్తినట్లు అధికారులు చెబుతున్నారు. ముజమ్మిల్​ విచారణలో ఆర్థిక లావాదేవీల సంబంధించిన కీలక సమాచారం రాబట్టినట్లు చెప్పారు.