
ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయిన హీరోయిన్ రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియోకు సంబంధించి బీహార్‌కు చెందిన 19 ఏళ్ల యువకుడిని ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు. ఆ యువకుడు ముందుగా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వీడియోను అప్‌లోడ్ చేసి, తర్వాత ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా షేర్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అతని సోషల్ మీడియా అకౌంట్ నుంచి ముందుగా వీడియో మొదట సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయబడినందని పోలీసులు అతనికి నోటీసులు ఇచ్చారు. అయితే తాను ఒక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి ఈ వీడియోను డౌన్‌లోడ్ చేసినట్లు బీహార్ యువకుడు చెప్పినట్లుగా తెలిపాడు. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు వెల్లడించారు.