పెట్రోల్ రేట్ తగ్గించిన ఢిల్లీ సర్కార్

పెట్రోల్ రేట్ తగ్గించిన ఢిల్లీ సర్కార్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్ ధరలతో ప్రజలు భయపడిపోతుంటే.. ఢిల్లీ జనాలకు మాత్రం కాస్త ఊరట కలిగింది. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్ రేట్లపై వ్యాట్ను భారీగా తగ్గిస్తూ కేజ్రీవాల్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో పెట్రోల్ మీద 30 శాతంగా ఉన్న వ్యాట్ ప్రస్తుతం 19.40 శాతానికి తగ్గింది. ఢిల్లీలో దాదాపు రూ.8 వరకు పెట్రోల్ ధర తగ్గింది. తగ్గిన పెట్రోల్ ధర బుధవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నట్లు ఢిల్లీ సర్కార్ ప్రకటించింది. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.97, డీజిల్ రేట్ రూ.86.67గా ఉంది. అదే ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98, డీజిల్ రేట్ రూ.94.14గా ఉంది. దేశంలోని అన్ని నగరాల్లోకెల్లా ముంబైలోనే ఫ్యుయల్ రేట్లు అధికంగా ఉన్నాయి.