లిక్కర్ స్కాం : సీబీఐ, ఈడీ కేసుల్లో మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపు

లిక్కర్ స్కాం :  సీబీఐ, ఈడీ కేసుల్లో మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియా జ్యూడిషియల్ రిమాండ్ ను మే 1 వ  తేదీ వరకు పొడిగించింది సీబీఐ స్పెషల్ కోర్టు. అయితే కాసేపటికే మళ్లీ సిసోడియా కస్టడీ పొడిగింపులో మార్పులు చేసింది కోర్టు.  ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియా   ఈడీ, సీబీఐ కేసుల్లో మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 17 తో ముగిసింది. సిసోడియాను ఢిల్లీ రౌస్  ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.  సీబీఐ కేసులో ఏప్రిల్ 27 వరకు, ఈడీ కేసులో ఏప్రిల్ 29 వరకు సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది.  ఇదే కేసులో రామచంద్ర పిళ్లై కస్టడీని  మే 1 వరకు పొడిగించింది కోర్టు.  ఫిబ్రవరిలో సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది.

ఈ కేసులో ఇప్పటికే రెండు చార్జ్ షీట్ లు దాఖలు చేసిన ఈడీ   త్వరలో  మూడో చార్జ్ షీట్ దాఖలు చేయనుంది.   ఢిల్లీ లిక్కర్  స్కాంలో   మనీష్ సిసోడియా  రిమాండ్  రిపోర్టులో  ఢిల్లీ సీఎం అరవింద్  కేజ్రీవాల్  పేరును చేర్చింది ఈడీ.  సీబీఐ నోటీసులివ్వడంతో కేజ్రీవాల్ ఏప్రిల్ 16న సీబీఐ విచారణకు హాజరయ్యారు. దాదాపు 9 గంటల పాటు కేజ్రీవాల్ ను సీబీఐ విచారించింది. ఎన్ని సార్లు పిలిచినా సీబీఐ విచారణకు హాజరవుతానని కేజ్రీవాల్ చెప్పారు. ఈడీ విచారణ మొత్తం వంద కోట్ల ముడుపుల గురించే విచారణ జరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా ఈడీ విచారించింది.

https://twitter.com/ANI/status/1647888913254739968