Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‭లో మరో వ్యక్తి అరెస్టు

Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‭లో మరో వ్యక్తి అరెస్టు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు మరొకరిని అరెస్టు చేశారు. మద్యం వ్యాపారవేత్త, బ్రిండ్ కో సేల్స్ డైరెక్టర్ అమన్ దీప్ ధాల్‭ను ఈడీ అదుపులోకి తీసుకుంది. నిందితుడు క్రెడిట్ నోట్, పాలసీ ఫార్ములేషన్‭లో ఇన్వాల్వ్ అయినట్లు ఈడీ గుర్తించింది. సాక్ష్యాధారాల ఆధారంగా అమన్ దీప్ ధాల్ పై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. అమన్ ధీప్ ను రౌస్ ఎవిన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెట్టారు. అతడికి సౌత్ గ్రూప్ తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. విచారణ కోసం అమన్ ధీప్ ను 5 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరారు. కాగా.. లిక్కర్ స్కామ్‭లో మనీష్ సిసోడియాతో సహా మొత్తం 15 మంది నిందితులపై సీబీఐ కేసు నమోదు చేసింది.