delhi liquor scam: 9న విచారణకు రాలేను.. ఈడీకి కవిత లేఖ

delhi liquor scam: 9న విచారణకు రాలేను.. ఈడీకి కవిత లేఖ

ఈడీకి ఎమ్మెల్సీ కవిత(mlc kavitha) లేఖ రాశారు. మార్చి 9న ఈడీ విచారణకు హాజరుకాలేనని లేఖలో తెలిపారు. ఈ నెల 15 తర్వాత విచారణకు వస్తానని విజ్ఞప్తి చేశారు.  ఈ నెల 10న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష ఉన్నందున సమయం కావాలని కోరారు కవిత.  ముందస్తు అపాయింట్ మెంట్స్ ఉన్నందున.. మీరు చెప్పిన టైంలో విచారణకు హాజరుకాలేనని స్పష్టం చేస్తూ.. ఈడీకి లేఖ రాశారు కవిత. ఈ లేఖకు ఈడీ ఎలాంటి సమాధానం ఇస్తుందనే ఆసక్తికరంగా మారింది. 

2023, మార్చి 9వ తేదీన విచారణకు హాజరుకావాలని.. కవితకు ఈడీ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. మార్చి 10న మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం.. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేయనున్న క్రమంలో కవిత ఈడీకి లేఖ రాసింది.

 కవిత రాసిన రిక్వెస్ట్ లేఖకు ఈడీ  సానుకూలంగా స్పందిస్తుందా.. లేక షెడ్యూల్ ప్రకారమే హాజరు కావాలని ఆదేశిస్తుందా అనేది ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం అరుణ్ రామచంద్ర పిళ్లయ్ కస్టడీ మార్చి 13వ తేదీతో ముగుస్తుంది. కవిత మాత్రం 15వ తేదీ వరకు గడువు కోరింది. వీళ్లిద్దరినీ కలిసి విచారణ చేయాలనేది ఈడీ షెడ్యూల్ పెట్టుకుంది. ఈడీ సమయం ఇస్తే.. పిళ్లయ్ కస్టడీని పొడిగించాల్సి ఉంటుంది. కవితను ఎప్పుడు విచారించాలి.. ఎలా విచారించాలి.. కవిత లేఖను పరిగణలోకి తీసుకోవాలా లేదా అనేది ఈడీ చేతుల్లోనే ఉంది.