మెట్రోలో అసభ్యంగా ప్రవర్తిస్తే చర్యలు.. డీఎంఆర్సీ హెచ్చరిక

మెట్రోలో అసభ్యంగా ప్రవర్తిస్తే చర్యలు.. డీఎంఆర్సీ హెచ్చరిక

న్యూఢిల్లీ: మెట్రో రైళ్లలో పెట్రోలింగ్ ను పటిష్టం చేయాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్సీ) నిర్ణయించింది. రైళ్లలో అసభ్యకర చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు, డీఎంఆర్సీ సిబ్బంది రైళ్లలో పెట్రోలింగ్ చేస్తారని అధికారులు మంగళవారం తెలిపారు. మెట్రో స్టేషన్లలో, రైళ్లలో అశ్లీల కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా సీఐఎస్​ఎఫ్​ సిబ్బందితో కలిసి పోలీసులు మఫ్టీలో పెట్రోలింగ్ చేస్తారని వెల్లడించారు. ఢిల్లీ మెట్రోలో ఇటీవల ఓ యువతి బికినీతో ప్రయాణించిన వీడియో, మరో జంట ముద్దులు పెట్టుకుంటున్న వీడియో  వైరల్​గా మారాయి. డీఎంఆర్సీపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశా రు. దీంతో మెట్రోలో, స్టేషన్లలో అసభ్యంగా ప్రవర్తించే వారిపై చర్యలు తీసుకోవాలని 
పోలీసులకు డీఎంఆర్సీ లేఖ రాసింది.