పౌరసత్వ చట్టానికి మద్దతుగా ఢిల్లీలో ప్రదర్శన

పౌరసత్వ చట్టానికి మద్దతుగా ఢిల్లీలో ప్రదర్శన

పౌరసత్వ చట్టానికి మద్దతుగా ఢిల్లీలో ప్రదర్శన చేస్తున్నారు స్థానిక ప్రజలు. శుక్రవారం ఢిల్లీలోని సెంట్రల్ పార్క్ లో సిటిజన్షిప్ అమెండ్ మెంట్ చట్టానికి మద్దతుగా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. భారీసంఖ్యలో సెంట్రల్ పార్క్ కు చేరుకున్న ప్రజలు ఫ్లకార్డులతో తమ మద్దతును తెలుపుతున్నారు. దేశ పటిష్టతకు CAA చట్టం ఊతమిస్తుందన్నారు.

మరోవైపు… పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసలు చెలరేగాయి. ఇందులో భారీగా ఆస్తినష్టం జరిగింది. ఉత్తర ప్రదేశ్, ఢిల్లీలో పలు చోట్ల వాహణాలకు నిప్పంటించారు ఆందోళనకారులు. ఈ ఘటనపై… కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కమ్యునిస్ట్ పార్టీలు దేశంలోని ముస్లింలను తప్పుదోవపట్టిస్తున్నాయని చెప్పారు. లోకల్ ముస్లింలకు పౌరసత్వ చట్టంతో ఎటువంటి నష్టం జరగదని చెప్పారు. పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ లో మైనారిటీలుగా ఉన్న క్రిస్టియన్లు, సిక్కులకు, హిందువులకు, పార్సీలకు మాత్రమే పౌరసత్వబిల్లుతో లబ్దిచేకూరుతుందని చెప్పారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని చెప్పారు.