సమోసాలు కొనటానికి రైలును మధ్యలోనే ఆపాడా : వైరల్ వీడియోపై రైల్వేశాఖ ఏం చెబుతోంది..?

సమోసాలు కొనటానికి రైలును మధ్యలోనే ఆపాడా : వైరల్ వీడియోపై రైల్వేశాఖ ఏం చెబుతోంది..?

మధ్య ప్రదేశ్ రాష్ట్రం. ఇండోర్ ఏరియా. పట్టాలపై వెళుతున్న గూడ్స్ రైలు సడెన్ గా ఆగింది. అందులో నుంచి రైలు డ్రైవర్ కిందకు దిగాడు. పట్టాల పక్కన ఉన్న ఓ చిన్న బడ్డీ కొట్టులో సమోసాలు కొన్నాడు. సమోసాల ప్యాకెట్ మళ్లీ రైలు ఎక్కాడు.. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ గూడ్స్ రైలు వెళ్లిపోయింది. ఈ మొత్తం ఇన్సిడెంట్ ను ఓ వ్యక్తి వీడియో తీశాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే గంటల్లోనే వైరల్ అయ్యింది. లోకో పైలెట్ (రైలు డ్రైవర్) సమోసాల కోసం రైలు ఆపాడు అని.. నెటిజన్లు  ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. 

అక్కడ సమోసాలు అంత బాగుంటాయా.. సమోసాల కోసం రైలు ఆపాలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైలు డ్రైవర్ కు బాధ్యత లేదా.. ఎక్కడ పడితే అక్కడ రైలు ఆపుతాడా.. అదేమన్నా బస్సునా.. లారీనా ఏంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. సమోసాల కోసం రైలు ఆపటం ఏంటయ్యా.. మన గ్రేట్ రైలు డ్రైవర్లు అంటూ చురకలు వేస్తున్నారు మరి కొంత మంది నెటిజన్లు. 

సమోసాల కోసం రైలు ఆపాడా లేదా అనే విషయంపై.. ఆన్ లైన్ లో వైరల్ అవుతున్న వీడియోపై రైల్వే శాఖ స్పందించింది. సమోసాల కోసం రైలు ఆపలేదని.. రైల్వే పనులు జరుగుతున్న కారణంగా.. ఆ ప్రాంతంలో రైలుకు రెడ్ సిగ్నల్ ఉందని.. ఆ సమయంలో డ్రైవర్ సమోసాలు కొని ఉంటాడని స్పష్టం చేసింది రైల్వే శాఖ. 

పట్టాలపై వర్క్ జరుగుతుందని.. షెడ్యూల్ ప్రకారం అక్కడ రైలును ఆపాల్సి వచ్చిందని.. ఆ సమయంలో రైలు డ్రైవర్ సమోసాలు కొన్నాడని.. ఇందులో తప్పు పట్టాల్సింది ఏంటని ప్రశ్నిస్తుంది రైల్వేశాఖ. 

రైల్వే శాఖ వివరణ ఎంత మంది రీచ్ అవుతుందో ఏమో కానీ.. సమోసాల కోసం రైలు ఆపారు.. రైలు నుంచి డ్రైవర్ కిందకు దిగటం.. రోడ్డు పక్కన షాపులో సమోసాలు కొనటం అంతా వీడియోలో కనిపిస్తుండటం.. సమోసాల కోసమే రైలు ఆపారు అనేది మాత్రమే నమ్ముతున్నారు నెటిజన్లు. 

ఏదిఏమైనా సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో.. ఎందుకు వైరల్ అవుతుందో ఎవరు చెప్పగలరు.. ఎవరి జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతుందో ఎవరు ఊహించెదరు చెప్పండీ...