వాయు కాలుష్యం గుప్పిట ఢిల్లీ.. చాలా చోట్ల ఏక్యూఐ పూర్, వెరీ పూర్..

వాయు కాలుష్యం గుప్పిట ఢిల్లీ.. చాలా చోట్ల ఏక్యూఐ పూర్, వెరీ పూర్..

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతోంది. నగరంలో చాలాచోట్ల ఆదివారం ఉదయం ఎయిర్  క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) పూర్, వెరీ పూర్  కేటగిరిల్లో నమోదైంది. అక్షర్ ధామ్  ఏరియాలో ఈసీజన్​లోనే అత్యధికంగా ఏక్యూఐ 426 పాయింట్లుగా రికార్డయింది. కాలుష్య నియంత్రణకు అధికారులు.. ఇండియా గేట్  వద్ద వాటర్ స్ప్రింక్లర్లను ఏర్పాటు చేశారు. 

శనివారం ఢిల్లీలో సగటు ఏక్యూఐ 268గా నమోదైంది. 38 మానిటరింగ్  స్టేషన్లలో 9 ఇప్పటికే ‘వెరీ పూర్’ కేటగిరిలోకి వెళ్లిపోయాయని పొల్యూషన్  కంట్రోల్  బోర్డు అధికారులు తెలిపారు. దీపావళి నేపథ్యంలో బాణసంచా కాల్చడం, పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనం చేస్తుండడం వంటి కారణాల వల్ల వచ్చే రోజుల్లో కాలుష్యం పెరిగే ప్రమాదం ఉందని అధికారులు చెప్పారు.