కామారెడ్డి జిల్లా డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల నవజాత శిశువు మృతి చెందింది. మాచారెడ్డి మండలం భవానిపేట గ్రామానికి చెందిన కల్పన అనే గర్భిణి పురిటి నొప్పులు రావడంతో కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యింది. ఆమెకు డాక్టర్లు డెలివరీ కోసం ఆపరేషన్ చేస్తున్న సమయంలో తల్లి గర్భంలోనే నవజాత శిశువు మరణించింది.
దీంతో ఆగ్రహించిన కల్పన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హాస్పిటల్ సిబ్బంది వాగ్వాదానికి దిగారు. డాక్టర్ల నిర్లక్ష్యం తోనే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ హాస్పిటల్ ముందు బంధువులు, గ్రామస్తుల ఆందోళన దిగారు.
