5 శాతం పెరిగిన ఇండ్ల ధరలు

5 శాతం పెరిగిన ఇండ్ల ధరలు
  • హైదరాబాద్ లో 8 శాతం పెరుగుదల
  • చదరపు అడుగుకు రూ.9,218
  • ఢిల్లీలో అత్యధికంగా10 శాతం అప్​

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కీలకమైన సిటీల్లో ఇండ్లకు​ డిమాండ్​ పుంజుకుంది. అయితే నిర్మాణ ఖర్చు పెరగడం వంటి వాటి వల్ల వీటి ధరలు ఈ ఏడాది ఏప్రిల్​–జూన్​ మధ్య కనీసం ఐదు శాతం పెరిగాయి. రియల్టర్ల అపెక్స్ బాడీ క్రెడాయ్, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా డేటా అనలిటిక్ సంస్థ లియాసెస్ ఫోరాస్ స్టడీ రిపోర్టు ఈ సంగతులను వెల్లడించింది. ఇవి ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇండ్ల ధరలపై 'హౌసింగ్ ప్రైస్-ట్రాకర్ రిపోర్ట్ 2022' పేరుతో రిపోర్టును విడుదల చేశాయి. దీని ప్రకారం -- ఢిల్లీ-–ఎన్​సీఆర్​, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్​), చెన్నై, కోల్‌‌‌‌‌‌‌‌కతా, బెంగళూరు, హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్​లలో ఇండ్ల ధరలు కనీసం ఐదుశాతం పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్–-జూన్ క్వార్టర్​లో ఇన్వెంటరీలో స్వల్ప తగ్గుదల నమోదు అయింది. ఢిల్లీ–-ఎన్‌‌‌‌‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌లో అత్యధికంగా 10 శాతం, అహ్మదాబాద్, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో వరుసగా 9 శాతం, 8 శాతం రెసిడెన్షియల్ ధరలు పెరిగాయి. ప్రస్తుత ఇండ్ల ధరలు కరోనా ముందు స్థాయిల రేట్లను అధిగమించాయి. అంతటా డిమాండ్‌‌‌‌‌‌‌‌కు సరిపడా సరఫరా ఉంది. ఈ క్యాలెండర్ సంవత్సరం ఏప్రిల్-–జూన్ క్వార్టర్​లో అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌లో ఇండ్ల ధరలు సంవత్సరానికి 9 శాతం పెరిగి చదరపు అడుగుకి రూ.5,927కి చేరుకున్నాయి. బెంగళూరులో చదరపు అడుగుకు 4 శాతం ధర పెరిగి రూ.7,848కి చేరుకోగా, చెన్నైలో ఒక్క శాతం మాత్రమే పెరిగి చదరపు అడుగుకు రూ.7,129కి చేరుకుంది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఇండ్ల ధరలు ఏప్రిల్–-జూన్‌‌‌‌‌‌‌‌లో చదరపు అడుగుకు రూ.9,218గా ఉన్నాయి. ఇది క్రితం సంవత్సరంతో పోలిస్తే 8 శాతం పెరిగింది. కోల్‌‌‌‌‌‌‌‌కతాలో ఇండ్ల ధరలు కూడా 8 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.6,362కి చేరుకున్నాయి. అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్​గా పేరున్న ముంబై మెట్రో రీజియన్​లో ఇండ్ల ధరలు చదరపు అడుగుకి ఒక్క శాతం (చదరపు అడుగుకు రూ.19,677) మాత్రమే పెరిగాయి. ఢిల్లీ-–ఎన్​సీఆర్​ ప్రాపర్టీ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో ఇండ్ల ధరలు అత్యధికంగా ఏడాదికి 10 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.7,434కి చేరుకున్నాయి. పూణేలో జూన్ క్వార్టర్​లో ఇండ్ల ధరలు 5 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.7,681కి చేరుకున్నాయి. ఇక్కడ కార్పెట్ ఏరియా ఆధారంగా ధరలు ఉంటాయి.

గురుగ్రామ్​లో 21 శాతం పెరిగిన ధరలు
ఇదిలా ఉంటే ఢిల్లీ-–ఎన్‌‌‌‌‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌లో, గురుగ్రామ్‌‌‌‌‌‌‌‌లోని గోల్ఫ్‌‌‌‌‌‌‌‌కోర్సు రోడ్డు సమీపంలో నోయిడా ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్ వే వచ్చాక అక్కడ ధరలు అత్యధికంగా 21 శాతం   వరకు పెరిగాయి. అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌లో ఇండ్ల ధరలు 3 సంవత్సరాలలో అత్యధికస్థాయికి చేరాయి. గాంధీనగర్ సబర్బ్‌‌‌‌‌‌‌‌లో అత్యధికంగా 13 శాతం పెరుగుదల కనిపించింది. సెంట్రల్ చెన్నైలో ధరలు దాదాపు 13 శాతం తగ్గగా, పశ్చిమ పూనమల్లిలో అత్యధికంగా 13 శాతం పెరిగాయి. కోల్‌‌‌‌‌‌‌‌కతా నైరుతి హౌరాలో అత్యధికంగా 13 శాతం పెరుగుదల ఉంది. ముంబై మెట్రో రీజియన్​ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో వెస్ట్రన్ సబర్బ్‌‌‌‌‌‌‌‌లలో (దహిసర్‌‌‌‌‌‌‌‌) ఏడాది ప్రాతిపదికన అత్యధికంగా 12 శాతం ధరలు పెరిగాయి. పూణె మార్కెట్‌‌‌‌‌‌‌‌లోని కోత్రుడ్​లో ఇండ్ల ధరలు గరిష్టంగా 10 శాతం దాకా ఎగిశాయి."గత పదేళ్లలో ఇండ్ల ధరలు పెద్దగా పెరగలేదు. బిల్డర్లకు చాలా తక్కువ మార్జిన్లే ఉన్నాయి.  బిల్డింగ్ మెటీరియల్స్ ధరల పెరుగుదల వల్ల డెవలపర్లు బయర్లపై భారం మోపుతున్నారు" అని ఏఐపీఎల్​ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంకజ్ పాల్ చెప్పారు. 

తగ్గిన ఇన్వెంటరీ
మెట్రో నగరాల్లో గడచిన కొన్ని క్వార్టర్లలో ధరలతోపాటు కొత్త ప్రాజెక్టులు లాంచ్‌‌‌‌‌‌‌‌లు పెరిగినప్పటికీ, ఇన్వెంటరీ (అమ్ముడుపోని ప్రాపర్టీలు) తగ్గింది. బెంగళూరులో ఇన్వెంటరీ అత్యధికంగా 21 శాతం తగ్గుదల కనిపించింది. అమ్మకాలు బాగుండటమే ఇందుకు కారణం. హైదరాబాద్, ముంబై మెట్రో రీజియన్​, అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌లలో మాత్రమే ఇన్వెంటరీ పెరుగుదల కనిపించింది. ఈ సిటీలలో కొత్త లాంచ్‌‌‌‌‌‌‌‌లు కూడా పెరిగాయి. ముంబై మెట్రో రీజియన్​లో ఇన్వెంటరీ అత్యధికంగా 36శాతం, ఢిల్లీ-–ఎన్‌‌‌‌‌‌‌‌సిఆర్‌‌‌‌‌‌‌‌లో 14 శాతం, పూణేలో 13 శాతం ఉంది. ఈ విషయమై లియాసెస్ ఫోరస్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ కపూర్ మాట్లాడుతూ ధరలు ఇక నుంచి ‘రేంజ్​బౌండ్’లో ఉంటాయని అన్నారు. డిస్కౌంట్​ ఈఎంఐ పథకాలతో, పెరుగుతున్న వడ్డీ రేట్ల ఎఫెక్ట్​ను డెవలపర్లు తట్టుకుంటున్నారని చెప్పారు. పండుగ ఆఫర్లతోపాటు, కొత్త సరఫరా పెరుగుతున్నందున సేల్స్​ మెరుగుపడే అవకాశం ఉందని కపూర్ వివరించారు. క్రెడాయ్ నేషనల్​ ప్రెసిడెంట్​హర్ష వర్ధన్ పటోడియా మాట్లాడుతూ కీలకమైన నిర్మాణ సామగ్రి రేట్లు, లేబర్ జీతాల పెరుగుదల ఇండ్ల ధరల పెరుగుదలకు కారణమని పేర్కొన్నారు. హోంలోన్లపై వడ్డీ రేట్ల పెంపు కారణంగా డిమాండ్‌‌‌‌‌‌‌‌పై కొంచెం ఎఫెక్ట్​ ఉంటుందని, సెప్టెంబర్ నుంచి అమ్మకాలు పెరుగుతాయని చెప్పారు. రానున్న పండుగల సీజన్‌‌‌‌‌‌‌‌లో మార్కెట్‌‌‌‌‌‌‌‌ సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌ బాగుంటుందని, వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ అమ్మకాలు ఎక్కువగానే ఉంటాయని కొలియర్స్‌‌‌‌‌‌‌‌ ఇండియా చీఫ్‌‌‌‌‌‌‌‌ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ రమేష్‌‌‌‌‌‌‌‌ నాయర్‌‌‌‌‌‌‌‌ తెలిపారు.