V6 News

కుందనపల్లి, పెద్దంపేట వద్ద రైల్వే అండర్బ్రిడ్జిలను నిర్మించాలి

కుందనపల్లి, పెద్దంపేట వద్ద రైల్వే అండర్బ్రిడ్జిలను నిర్మించాలి

గోదావరిఖని, వెలుగు: రామగుండం నియోజకవర్గ పరిధిలోని కుందనపల్లి ఎల్‌‌సీ గేట్​నెంబర్​49, పెద్దంపేట గేట్​నెంబర్​ 51తో పాటు మల్యాలపల్లి, బద్రిపల్లి వద్ద రైల్వే అండర్​ బ్రిడ్జిలను త్వరితగతిన నిర్మించాలని దక్షిణమధ్య రైల్వే యూజర్స్​ కమిటీ మెంబర్​ అనుమాస శ్రీనివాస్​ కోరారు. 

మంగళవారం సికింద్రాబాద్​ రైల్​ నిలయంలో డీఆర్ఎం గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగిన డివిజనల్​ రైల్వే యూజర్స్​ కమిటీ మెంబర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రైల్వే అండర్​ బ్రిడ్జిల నిర్మాణం విషయంలో ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కేంద్ర రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్లారని, వారు సానుకూలంగా స్పందించారని గుర్తు చేశారు.