
హైదరాబాద్, వెలుగు: గచ్చిబౌలిలో భాగ్యనగ ర్ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ మ్యూచువ ల్ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సోసైటీకి (బీటీఎన్జీవో) కేటాయించిన స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులు కబ్జాకు యత్నిస్తున్నారని సీఎస్ రామకృష్ణరావుకు టీఎన్జీవో కేంద్ర సంఘం నేతలు ఫిర్యాదు చేశారు. శుక్రవారం సెక్రటే రియెట్ లో సీఎస్ ను టీఎన్జీవోకేంద్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీ శ్వర్, ముజీబ్, నేతలు సత్యనారాయణ గౌడ్, కస్తూరి వెంకట్ తదితరులు కలిసి ఫిర్యాదు ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే ఆ స్థలాలను గత ఉత్తర్వుల మేరకు సొసైటీకి కేటాయించాలని సీఎస్ ను కోరారు.
సీఎస్ తోపాటు సీఎం ప్రిన్సి పల్సెక్రటరీ శేషాద్రి, రెవెన్యూ సెక్రటరీ లోకేష్ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేశామని నేతలు తెలిపారు. ఈ అంశంపై విచారణ జరిపిస్తామ ని సీఎస్, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రిలు హామీ ఇచ్చారని జగదీశ్వర్, ముజీబ్ లు పత్రిక ప్రకటనలో వెల్లడించారు. దాదాపు 4 వేల మంది రిటైర్ ఉద్యోగులు, సర్వీసులో ఉన్న ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని ఆ స్థలాలను వారికి కేటాయించాలని నేతలు కోరారు. గచ్చిబౌలిలో బీటీఎన్జీవో సొసైటీకి మొత్తం 189 ఎకరాలు ఉండగా ఇందులో కొత్తగా హౌసింగ్ సొసైటీ నేతలు వచ్చి 90 ఎకరాలు తమ సొసైటీది అని ఆక్రమిస్తున్నా రని నేతలు సీఎస్ కు తెలిపారు.