గోదావరిఖనిని కలుపుతూ రైల్వే మార్గం వేయాలి : రామగుండం మాజీ ఎమ్మెల్యే

గోదావరిఖనిని కలుపుతూ రైల్వే మార్గం వేయాలి : రామగుండం మాజీ ఎమ్మెల్యే

గోదావరిఖని, వెలుగు: రామగుండం–మణుగూరు రైల్వే లైన్ రూట్‌‌‌‌‌‌‌‌లో మార్పులు చేయాలని, గోదావరిఖనిని కలుపుతూ కొత్త మార్గాన్ని నిర్మించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్​ డిమాండ్​ చేశారు. శుక్రవారం గోదావరిఖని ప్రెస్‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌లో జరిగిన మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడుతూ ప్రజా సౌకర్యం కోసం, రవాణా మెరుగుదలను దృష్టిలో పెట్టుకొని రైల్వే లైన్ నిర్మాణం విషయంలో మార్పులు చేయాలని ఆయన కోరారు. 

రూ.5818.45 కోట్లతో సుమారుగా 208 కిలోమీటర్ల పొడవునా నిర్మించనున్నఈ రైల్వే లైన్‌‌‌‌‌‌‌‌ను రాఘవాపూర్​ నుంచి కాకుండా రామగుండం నుంచి గోదావరిఖని, 8వ కాలనీ, మంథని మీదుగా నిర్మించాలని కోరారు. ఈ కొద్దిపాటి మార్పు వల్ల రామగుండం నగర  ప్రజలకు రవాణా మరింత మెరుగుపడుతుందని వివరించారు. రాఘవపూర్ నుంచి లైన్ వేయడం వల్ల పెద్దగా ఉపయోగమేమీ ఉండదన్నారు. మీటింగ్​లో కార్పొరేటర్లు మేకల సమ్మయ్య, తోకల రమేశ్‌‌‌‌‌‌‌‌, లీడర్లు మురళీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, విజయ రెడ్డి, లక్ష్మి, కృష్ణవేణి, పద్మ, రాజయ్య, దేవరాజ్, శ్రీనివాస్, వాసు, కిరణ్, కనక రాజు, తదితరులు పాల్గొన్నారు.