అప్పు తిరిగివ్వాలనడం ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదు: బాంబే హైకోర్టు కీలక తీర్పు

అప్పు తిరిగివ్వాలనడం ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదు: బాంబే హైకోర్టు కీలక తీర్పు

ముంబై: అప్పుగా ఇచ్చిన సొమ్ము ను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేయడం ఆత్మహత్యకు ప్రేరేపించ డం కాబోదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. రుణదాతకు తన సొమ్మును వసూలు చేసుకునే హక్కు ఉంటుందని గుర్తుచేసింది. రుణానికి సంబంధించిన రీపేమెంట్ కోసం డిమాండ్ చేయడాన్ని ఆత్మహత్యకు ప్రేరేపించడమని అనడం సరికాదని అభిప్రాయపడింది. ఈమేరకు మహారాష్ట్రలోని కొల్హాపూర్ స్కూల్ టీచర్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఊరట కల్పిస్తూ తీర్పు వెలువరించింది. వారిపై మోపిన నేరారోపణలను జస్టిస్ రంజిత్ సిన్హా రాజా భోన్సలె బెంచ్ తోసిపుచ్చింది.