- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
హైదరాబాద్, వెలుగు: డీలిమిటేషన్ బిల్లు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, కేంద్రప్రభుత్వ నియంతృత్వాన్ని ప్రజాస్వామ్యం ఓడించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. హిమాయత్ నగర్‌లోని రాజ్ బహదూర్ హాల్‌లో సీపీఐ మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా సమితి కార్యవర్గ సమావేశానికి కూనంనేని ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
పార్లమెంట్‌లో మోదీ, అమిత్ షా ద్వయం నియంతృత్వంగా ప్రవేశపెట్టిన డిలీమిటేషన్ బిల్లును ప్రతిపక్షాలన్ని ఏకమై ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాయని తెలిపారు. డీలిమిటేషన్ బిల్లు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్రమైన ముప్పుగా మారిందని చెప్పారు

