
ధరల పెరుగుదల, నిరుద్యోగం దేశాన్ని పట్టి పీడిస్తున్నాయన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఈ రెండు సమస్యలకు ప్రధాని మోడీ కానీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యానాథ్ కానీ సమాధానం చెప్పడంలేదన్నారు. తన పాత నియోజకవర్గం అమేఠీలోని జగదీశ్ పూర్ లో బీజేపీ భగావో.. మెహంగాయీ హఠావో ర్యాలీ నిర్వహించారు. మోడీ నిర్ణయాలు మిడిల్ క్లాస్ తో పాటు పేదలపై మోయలేని భారం పడిందన్నారు. నోట్లరద్దు, జీఎస్టీ అమలు సరిగా చేయకపోవడం, కోవిడ్ సమయాల్లో ఎలాంటి సహాయం చేయకపోవడం వంటివి నిరుద్యోగానికి కారణమయ్యాయని చెప్పారు.