పాన్ ఇవ్వలేదని షాపు ఓనర్ చెవి, పెదవులు కొరికాడు

పాన్ ఇవ్వలేదని షాపు ఓనర్ చెవి, పెదవులు కొరికాడు

ఫ్రీ గా కిళ్లీ(పాన్) ఇవ్వలేదని పాన్ షాపు యజమాని చెవి, పెదవి కొరికి దాడి చేశాడు ఓ యువకుడు. ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని అలంబాగ్‌లో జరిగింది.  శాలు(28) అనే ఓ వీడియో గ్రాఫర్ మంగళవారం రాత్రి పాన్ తీసుకునేందుకు ఓ షాపు వద్దకు వెళ్లాడు. అప్పటికే ఆలస్యమవడంతో పాన్ షాప్ యాజమాని సత్యేంద్ర దుకాణాన్ని మూసేందుకు సిద్ధమవుతున్నాడు.

ఇంతలో అక్కడికి వచ్చిన శాలు తనకు ఫ్రీ గా కిళ్లీ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కుదరదని సత్యేంద్ర చెప్పడంతో అతనిపై రాయితో దాడి చేశాడు. అంతటితో ఆగకుండా సత్యేంద్ర చెవిని, పెదవి ని కొరికాడు ఆ యువకుడు. తీవ్ర గాయాలైన సత్యేంద్రను గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం అతడిని ఆసుపత్రికి తరలించారు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శాలును అరెస్టు చేశారు.