డిపార్ట్‌మెంట్ల వారీ ఖాళీ ఉద్యోగాలివే.. కేబినెట్‌కు రిపోర్ట్

డిపార్ట్‌మెంట్ల వారీ ఖాళీ ఉద్యోగాలివే.. కేబినెట్‌కు రిపోర్ట్
  • కేబినెట్​కు అన్ని శాఖల కార్యదర్శుల రిపోర్ట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 56,979  డైరెక్ట్ రిక్రూట్​మెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అన్ని శాఖల కార్యదర్శుల కేబినెట్​కు నివేదించారు. ఇందులో గవర్నమెంట్ డిపార్ట్​మెంట్లలో 44,022 ఉండగా, ప్రభుత్వ సంస్థల్లో12,957 పోస్టులు ఉన్నాయి. పోలీసు శాఖలో ఎక్కువగా ఖాళీలు ఉన్నాయి. హోం డిపార్ట్​మెంట్​లో 21,507 వేకెంట్ చూపించారు. ఆ తరువాత వైద్యారోగ్య శాఖలో 10,048 పోస్టులు, ఉన్నత విద్యాశాఖలో 3,825 పోస్టులు, బీసీ వెల్ఫేర్​లో 3,538 పోస్టులు, ఎస్సీ వెల్ఫేర్​లో 1,967, రెవెన్యూ విభాగంలో 1,700 పోస్టులు వేకెంట్ ఉన్నట్లు వెల్లడించారు. అత్యల్పంగా ఐటీ శాఖ​లో 4 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేల్చారు.