అడ్డగోలు ఇసుక తవ్వకాలను అడ్డుకోండి... భట్టి విక్రమార్క

అడ్డగోలు ఇసుక తవ్వకాలను అడ్డుకోండి... భట్టి విక్రమార్క

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని నదుల తీరాల వెంబడి జరుగుతున్న అడ్డగోలు ఇసుక తవ్వకాలను అడ్డుకోవాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. గోదావరి తీరం వెంట నిఘా పెంచాలని స్పష్టం చేశారు. ఇసుక, వివిధ గనుల తవ్వకాలకు సంబంధించి వార్షిక క్యాలెండర్ రూపొందించి వెంటనే టెండర్లు పిలవాలని సూచించారు. మంగళవారం ఆయన సెక్రటేరియెట్​లో గనుల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల రిపేర్లకు ఇసుక తరలింపులో ఆటంకం కలగకుండా చూడాలన్నారు.

గ్రానైట్ క్వారీలకు వేసిన ఫైన్ ల వసూలు, ప్రస్తుతం వాటి పరిస్థితిని సమీక్షించాలన్నారు. గనుల శాఖలో ఆదాయాలు పెంచే మార్గాలను అన్వేషించాలని చెప్పారు. ఇసుక రీచ్ లను ఆయా ప్రాంతాల్లోని మహిళా సంఘాలకు కేటాయించాలని తెలిపారు. ఇసుక ర్యాంపు నుంచి వినియోగదారునికి చేరేవరకు దళారీ వ్యవస్థ లేకుండా ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు.