- హెల్త్ కార్డులు, ఇండ్ల జాగలపై ప్రభుత్వ పెద్దలను కలవాలని తీర్మానం
హైదరాబాద్, వెలుగు: కొత్తగా ఏర్పడిన డెస్క్ జర్నలిస్టుల సంఘం(డీజేఎస్).. రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నది. ఆదివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో డెస్క్ జర్నలిస్టుల సంఘం ప్రెసిడెంట్‌గా బాదిని ఉపేందర్, ప్రధాన కార్యదర్శిగా రాజారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సోమనర్సయ్య(వరంగల్), ట్రెజరర్‌గా వెంకటరమణ, జాయింట్ సెక్రటరీలుగా కనపర్తి రమేశ్, కాంకూరి వెంకటేశ్వర్(ఖమ్మం), భీంరావు(నిజామాబాద్), కమిటీ మెంబర్లుగా గరిమ, పద్మ, సత్యప్రసాద్ ఎన్నికయ్యారు. జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు, ఇండ్ల జాగల విషయంలో ప్రభుత్వ పెద్దలు, సంబంధిత అధికారులకు వినతులు సమర్పించాలని డీజేఎస్ తీర్మానించింది.
ఈ సందర్భంగా డీజేఎస్ ప్రెసిడెంట్ బాదిని ఉపేందర్ మాట్లాడుతూ.. డెస్క్ జర్నలిస్టుల గొంతుకగా ఉంటూ, వారి సంక్షేమం, ప్రయోజనాల కోసం డీజేఎస్ పోరాటం చేస్తుందన్నారు. ‘‘ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి డెస్క్ జర్నలిస్టుల ప్రస్తావన తేవడం మనందరి ఐక్య పోరాటానికి దక్కిన గుర్తింపు. ఇకముందు కూడా ఇదే యూనిటీతో సమస్యల పరిష్కారానికి కృషి చేద్దాం” అని పిలుపునిచ్చారు. సమావేశంలో నరేందర్, సదానందం, లింబాద్రి, అశోక్, రమేశ్ కుమార్, సత్యం, జిల్లా డెస్క్ జర్నలిస్టులు పాల్గొన్నారు.
