అవిశ్వాసం పెట్టే ముందు అభివృద్ధి చూడాలి : డిప్యూటీ మేయర్

అవిశ్వాసం పెట్టే ముందు అభివృద్ధి చూడాలి : డిప్యూటీ మేయర్
  • బడంగ్ పేట్ డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్

ఎల్​బీనగర్, వెలుగు: అవిశ్వాసం పెట్టే ముందు తాను చేస్తున్న అభివృద్ధిని చూడాలని బడంగ్ పేట డిప్యూటీ మేయర్, బీఎస్పీ రాష్ట్ర నాయకుడు ఇబ్రమ్ శేఖర్ చెప్పారు. బడంగపేట మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి తమతో పార్టీ వారైనా కలిసి రావచ్చని బీజేపీ కార్పొరేటర్లు పిలుపునివ్వడంతో డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్ మంగళవారం స్పందించారు. బీజేపీ కార్పొరేటర్లు చేస్తున్న కామెంట్లపై వారికే క్లారిటీ లేదని మండిపడ్డారు.

తాను ఏం అభివృద్ధి చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. దళితులను అణగదొక్కే కార్యక్రమం పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఒక దళితున్ని కాబట్టే పక్కకు తప్పించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఏ కారణంతో తనపై అవిశ్వాసం పెట్టాలనుకుంటున్నారో చెప్పాలన్నారు. ప్రాణం ఉన్నంత వరకు అట్టడుగు వర్గాల వారి కోసం పోరాటం చేస్తామన్నారు.