ఆలయాల్లో చండీహోమం

ఆలయాల్లో చండీహోమం

గురువారం పౌర్ణమి కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో చండీ హోమం నిర్వహించగా 200 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. వెస్ట్ మారేడ్‌పల్లి సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలో గురుదత్త జయంతి సందర్భంగా స్వామివారికి అభిషేకాలు చేశారు. 

దత్తాత్రేయస్వామిని పుష్పాలతో అలంకరించారు. పూజలు, హోమం నిర్వహించారు. లోయర్ ట్యాంక్ బండ్ కట్టమైసమ్మ ఆలయంలో చండీ హోమం, మహా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. - పద్మారావునగర్/ ముషీరాబాద్​, వెలుగు