V6 News

జగిత్యాల జిల్లాలో.. భక్తులతో కొండగట్టు కిటకిట  

జగిత్యాల జిల్లాలో.. భక్తులతో కొండగట్టు కిటకిట  

జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. సుమారు 30వేల మంది భక్తులు తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. వరుస సెలవులు రావడంతో భక్తుల రద్దీ పెరిగింది.

అంజన్న దర్శనానికి సుమారు రెండు గంటల వరకు సమయం పట్టింది.   కొడంగల్ ​నియోజకవర్గం అంగడి రాయచూర్ ​గ్రామానికి చెందిన పలువురు విద్యార్థులు అంజన్న దర్శనానికి వచ్చారు. తమది సీఎం ఊరు అంటూ నినాదాలు చేశారు.