Book Fair : ఒక యోగి ఆత్మ కథ.. సగం ధరకే ఆధ్యాత్మిక పుస్తకాలు

Book Fair : ఒక యోగి ఆత్మ కథ.. సగం ధరకే ఆధ్యాత్మిక పుస్తకాలు

హైదరాబాద్ : అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ బేగంపేట చికోటీ గార్డెన్స్‌లోని యోగదా సత్సంగ సొసైటీ ధ్యాన కేంద్రంలో ఆధ్యాత్మిక పుస్తకాల మేళా నిర్వహిస్తుంది సొసైటీ. 2023, జూన్ 17వ తేదీ అన్ని ఆధ్యాత్మిక పుస్తకాలపై 50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. వైఎస్ఎస్, ఎస్ఆర్ఎఫ్ వ్యవస్థాపకులు పరమహంస యోగానంద రచించిన ఒక యోగి ఆత్మకథ, మానవుడి నిత్యాన్వేషణ, ఆత్మసాక్షాత్కారం వైపు ప్రయాణం, దివ్య ప్రణయం, వెలుతురున్న చోట తదితర పుస్తకాలు సగం ధరకే లభించనున్నాయి.

అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో భాగంగా వైఎస్ఎస్ ధ్యాన కేంద్రంలో జూన్ 18వ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగున్నర తర్వాత ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే క్రియా యోగ దీక్ష తీసుకున్న వారితో పాటు కొత్త వారు కూడా ఈ కార్యక్రమాలకు హాజరుకావొచ్చని నిర్వాహకులు ప్రకటించారు. శక్తిపూరక వ్యాయామాలతో పాటు పరమహంస యోగానంద బోధనల పఠనం, ధ్యానం, భజనలతో సత్సంగ్‌ నిర్వహించనున్నారు.

మరింత సమాచారం కోసం: Yssofindia.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. క్రియాయోగ పాఠాల గురించి మరిన్ని వివరాలకు 06516655555, 9441245839, 9666665328 నెంబర్లకు ఫోన్ చేయవచ్చని నిర్వాహకులు సూచించారు.