సైబర్ నేరాలను కట్టడి చేయాలి : డీజీపీ అంజనీకుమార్‌‌‌‌‌‌‌‌

సైబర్ నేరాలను కట్టడి చేయాలి : డీజీపీ అంజనీకుమార్‌‌‌‌‌‌‌‌
  • డ్రగ్స్ సప్లయ్ , సైబర్‌‌‌‌‌‌‌‌ క్రైమ్‌‌‌‌ ను అరికట్టేందుకు కృషి చేయాలి

హైదరాబాద్,వెలుగు:రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్‌‌‌‌‌‌‌‌ నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయని డీజీపీ అంజనీకుమార్ అన్నారు. సైబర్‌‌‌‌‌‌‌‌ క్రైమ్‌‌‌‌, డ్రగ్స్‌‌‌‌ సప్లయ్​కు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర సైబర్‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ బ్యూరో,యాంటీ నార్కొటిక్స్‌‌‌‌ బ్యూరోలు కృషి చేయాలని సూచించారు..అత్యంత ప్రధానమైన ఈ రెండు బ్యూరోలు సమర్థవంతంగా పనిచేసేలా చూడాల్సిన బాధ్యత అధికారులందరిపై ఉందన్నారు. ప్రతి నెలా నిర్వహించే క్రైమ్ రివ్యూలో భాగంగా శనివారం  ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ కాన్ఫరెన్స్‌‌‌‌లో ఐజీలు షానవాజ్ ఖాసీం,చంద్రశేఖర్‌‌‌‌ ‌‌‌‌రెడ్డి, సైబర్‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ విశ్వజిత్ కంపాటి సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ..ఆన్‌‌‌‌లైన్ గ్రేవ్ క్రైమ్, ఫంక్షనల్‌‌‌‌ వర్టికల్స్, సైబర్‌‌‌‌‌‌‌‌ క్రైమ్స్, పాత కేసులు,క్రైమ్‌‌‌‌ రేట్‌‌‌‌ గురించి వివరాలు తెలుకున్నారు. సంగారెడ్డి, జగిత్యాల, సిద్దిపేట, పెద్దపల్లి తర్వాతి స్థానాల్లో రామగుండం కమిషనరేట్‌‌‌‌లో అండర్ ఇన్వెస్టిగేషన్‌‌‌‌(యూఐ)కేసులు అత్యధికంగా ఉన్నాయని తెలిపారు. రాచకొండ కమిషనరేట్‌‌‌‌ పరిధిలో నమోదైన తీవ్రమైన నేరాల్లో శిక్షల సంఖ్య పెరిగిందన్నారు. రాష్ట్రంలో మహిళలపై 46.34 శాతం నేరాలు తగ్గినట్లు గుర్తించామని డీజీపీ తెలిపారు. దోపిడీలు, ప్రాపర్టీ అఫెన్స్‌‌‌‌లు తగ్గుముఖం పడుతున్నాయన్నారు. హైదరాబాద్ శివార్లలో ఇలాంటి నేరాలు గణనీయంగా తగ్గాయని ఆయన చెప్పారు.