ఫిర్యాదులొస్తున్నయ్‌‌‌‌.. బీకేర్ ఫుల్!..పోలీసులు సివిల్ వివాదాల జోలికి పోవొద్దు: డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌

ఫిర్యాదులొస్తున్నయ్‌‌‌‌.. బీకేర్ ఫుల్!..పోలీసులు సివిల్ వివాదాల జోలికి పోవొద్దు: డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: పోలీసు అధికారుల పనితీరుపై ఫిర్యాదులొస్తున్నయ్​.. బీకేర్​ఫుల్​.. భూవివాదాలు, సివిల్  వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు అని డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌ సూచించారు. టెక్నాలజీ వినియోగం, ప్రజలకు సత్వర సేవలకు సంబంధించి అన్ని యూనిట్ల అధికారులు, ఎస్‌‌‌‌హెచ్‌‌‌‌వోలతో డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌ శుక్రవారం  డీజీ ఆఫీసులో సమీక్ష నిర్వహించారు. 112 అత్యవసర సేవలను డ్రోన్ ఇంటిగ్రేషన్‌‌‌‌తో అనుసంధానించే కార్యక్రమాన్ని  ప్రభుత్వం త్వరలోనే ప్రారంభించనున్నట్టు తెలిపారు. 

ఈ-సాక్ష్యం పోర్టల్‌‌‌‌లో  పూర్తి ఆధారాలు ఉండాలి..

కేసుల దర్యాప్తులో సీసీటీఎన్‌‌‌‌ఎస్, ఈ–--సాక్ష్యం పోర్టల్​లో పూర్తి ఆధారాలు ఉండాలని డీజీపీ సూచించారు. ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు ఈ ప్రక్రియలో ముందంజలో ఉన్నాయన్నారు. భూపాలపల్లి 55 శాతం, సిద్ధిపేట 39 శాతం, నల్గొండ 31 శాతం పురోగతి సాధించాయని తెలిపారు. ఈ-–సమన్లు అమలులో కామారెడ్డి 92.86 శాతం, వనపర్తి 92 శాతంతో మంచి పనితీరు కనబరిచాయని వెల్లడించారు. హైదరాబాద్‌‌‌‌లోని నాలుగు కమిషనరేట్ల పరిధిలో సుమారుగా 70 శాతానికిపైగా సైబర్ నేరాల కేసులు నమోదవుతున్నాయని తెలిపారు.