మావోయిస్టులను రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వం

మావోయిస్టులను రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వం

డీజీపీ మహేందర్‌‌‌‌రెడ్డి
వెంకటాపురంలో రెండు జిల్లాల పోలీస్‌‌‌‌ ఆఫీసర్లతో రివ్యూ

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి/మణుగూరు, వెలుగు: ‘మావోయిస్టులు రాష్ట్రంలో అడుగుపెడితే అభివృద్ధి కుంటుపడుతుంది. తెలంగాణలో 30 ఏండ్లు నక్సల్స్‌‌‌‌ సృష్టించిన రక్త చరిత్రను ప్రజలంతా చూశారు. ప్రజలు తిప్పికొట్టడం వల్లే మావోయిస్టులు రాష్ట్రాన్ని వదిలేసి చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌కు పారిపోయారు. హింసా ప్రవృత్తి కలిగిన మావోలను రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వం’ అని రాష్ట్ర డీజీపీ మహేందర్‌‌‌‌రెడ్డి అన్నారు. శనివారం భూపాలపల్లి‒ములుగు జిల్లా పోలీస్‌‌‌‌ ఉన్నతాధికారుల రివ్యూ మీటింగ్ములుగు జిల్లాలోని వెంకటాపురం పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌లో నిర్వహించారు. హైదరాబాద్‌‌‌‌ నుంచి ప్రత్యేక హెలీక్యాప్టర్లో డీజీపీ ఇక్కడికి వచ్చారు. మావోయిస్టుల ఉనికి నేపథ్యంలో తీసుకుంటున్న పోలీస్‌‌‌‌ చర్యలపై సుమారు 2 గంటలపాటు సమీక్ష జరిపారు. అనంతరం డీజీపీ విలేకరులతో మాట్లాడుతూ దాదాపు పదేళ్ల క్రితం తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురై ఇక్కడి నుంచి పారిపోయిన మావోయిస్టులు మళ్లీ రాష్ట్రంలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు హరిభూషణ్, దామోదర్ తదితరులు చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రంలో మటన్‌‌‌‌, చికెన్‌‌‌‌, డ్రై ప్రూట్స్‌‌‌‌ తింటూ, ఐ ఫోన్స్‌‌, ల్యాప్‌‌‌‌ట్యాప్స్‌‌‌‌ ఉపయోగిస్తూ విలాస జీవితాలను గడుపుతూ అమాయక గిరిజనులను బలిపశువులు చేస్తున్నారని అన్నారు. మావోయిస్టులకు రాష్ట్రంలో ఎవరూ సహకరించకూడదని హెచ్చరించారు. కాంట్రాక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బులు వసూలు చేయాలనే పథకంతో తెలంగాణలో అడుగు పెట్టాలని మావోయిస్టులు చేసే ప్రయత్నాలను పోలీస్ శాఖ తిప్పి కొడుతుందన్నారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో డీజీపీ పర్యటించారు. రివ్యూలో అడిషనల్ డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి, ఐజీ నాగిరెడ్డి, ఐజీ ప్రభాకర్ రావు, ఐజీ నవీన్ చంద్, ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్, ఓఎస్డీలు కె. సురేష్ కుమార్, శోభన్ కుమార్, ఏఎస్పీలు శరత్‌‌‌‌చంద్ర పవార్‌‌‌‌, సాయి చైతన్య , గౌస్ ఆలం, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

For More News..

చనిపోయినప్పుడు నెగెటివ్‍.. తెల్లారే పాజిటివ్‍..

పెద్దపల్లి మహిళకు కరీంనగర్ లో అంత్యక్రియలు

272 కరోనా డెడ్ బాడీలకు అంత్యక్రియలు చేసిన మాజీ ఎమ్మెల్యే