ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్: కీలక నేతలకు బిగుస్తున్న ఉచ్చు.. 

ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్: కీలక నేతలకు బిగుస్తున్న ఉచ్చు.. 

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నేతలకు ఉచ్చు బిగిసే అవకాశం కనిపిస్తోంది. వెస్ట్ జోన్ డీజీపీ విజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.ఫోన్ ట్యాపింగ్ కేస్ లో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుందని, ఈ కేసులో ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదని, విచారిస్తామని అన్నారు.ఈ కేసుతో సంబంధం ఉన్న రాజకీయ నేతల వ్యవహారంపైన సాక్ష్యాలను సేకరిస్తున్నామని అన్నారు.

సాక్షాలు వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులను పిలిచి విచారిస్తామని, ఇప్పటికే దాఖలు చేసిన చార్జిషీటును కోర్టు పరిగణలోకి తీసుకుందని అన్నారు.కేసులో కీలక నిందితులు ఇద్దరు విదేశాల్లో ఉన్నారని, వాళ్ళని ఇండియాకు రప్పించే ప్రయత్నం కొనసాగుతున్నాయని అన్నారు.