ధనుష్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓం’. ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నాడు. వండర్‌బార్ ఫిలింస్, ఆర్‌టేక్ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ మూవీ టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఎర్రచందనం బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు టీజర్ ద్వారా రివీల్ చేశారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకోగా, వారిని కాపాడటానికి వచ్చిన ధనుష్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించాడు. ‘ఓం – చాప్టర్ 1: ది బ్లడ్ వుడ్’ అంటూ ఈ టైటిల్‌ను అనౌన్స్ చేసి, రెండు భాగాలుగా ఈ చిత్రం రాబోతోందని రివీల్ చేశారు.
మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 16న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది.
