ధనుష్ ‘ఓం చాప్టర్ 1’ నుంచి ‘వీర వీర’ సాంగ్ రిలీజ్..  

ధనుష్ ‘ఓం చాప్టర్ 1’ నుంచి ‘వీర వీర’ సాంగ్ రిలీజ్..  

హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్ ‘ఓం చాప్టర్ 1 ’.   ‘అమరన్’ ఫేమ్ రాజ్‌‌కుమార్  పెరియసామి దర్శకత్వం వహిస్తున్నాడు.  ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌‌తోపాటు ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. రీసెంట్‌‌గా మొదటి పాటను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దసరా సందర్భంగా సోమవారం సెకండ్ సాంగ్‌‌ను రిలీజ్ చేశారు. సాయి అభ్యంకర్ కంపోజ్ చేసిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ తెలుగు లిరిక్స్ రాశారు. సాయి అభ్యంకర్, రితేష్ జి రావ్ కలిసి పాడారు.

  ‘ఒక్కడే వచ్చే ఫిరంగి లెక్క.. పొట్టను చీల్చే సింగము లెక్క.. చుట్టూ మొత్తం మూడింది లెక్క.. ఢీ కొడితే కొండ లెక్క.. కొమ్ములుండవు పొట్టేలు లెక్క.. కాసుకోరా..  కాసుకోరా.. వీరా వీరా... ఓంకారం.. జ్వాలా నయనం నీదేరా..’ అంటూ  సాగిన పాటలో ధనుష్ హీరోయిజాన్ని చూపించడం ఆకట్టుకుంది.  ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి  ఇంపార్టెంట్ రోల్   కనిపించనున్నారు.  సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్స్‌‌గా నటిస్తున్నారు. నసీరుద్దీన్ షా, ఇంద్రన్స్  కీలక పాత్రలు పోషిస్తున్నారు.  వండర్‌‌‌‌బార్ ఫిలింస్, ఆర్‌‌‌‌టేక్ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.  నవంబర్ 20న  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.